Wednesday, September 4, 2013

శ్రీ గాయత్రీ మహా మంత్రం మహాత్వం

గాయత్రీ మంత్రం బుద్ధిని వికసింపజేస్తుందా?

గాయత్రీ మంత్రోచ్చారణ బుద్ధివికాసానికి తోడ్పడుతుందని విశ్వసింపబడినది. భారదేశంలోని కొన్ని వర్ణాల వారు ఈ మంత్రాన్ని అనుష్ఠించేవారు. తాము మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలని ఉద్దేశ్యపూరితంగా వారు స్వంత్ శాసనం వేసారు. కానీ కాలానుగుణంగా స్త్రీలతో సహా అన్ని వార్ణాలవారు గాయత్రి మంత్ర జపాన్ని చేయడం ప్రారంభించారు. భారతీయులే కాక ప్రపంచంలోని అనేక దేశస్తులు ఈ మంత్రాన్ని జపిస్తూ దాని సత్ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు.

ఓం భూర్భువ: సువ: తత్ సవితుర్వ రేణ్యం భర్గో దేవస్యధీ మహి ధియో యోన: ప్రహోదయాత్: !!

ఈ పై మంత్రమే గాయత్రి. ఈ మంత్రాన్ని దేవమాతఅని పిలుస్తారు. “సవిత” గాయత్రీ మంత్రమునకు అధిష్ఠాన దేవత, అగ్ని ముఖము, విశ్వామిత్రుడు ఋషి, గాయత్రి ఛందము. “ప్రణవ రూపమైన ‘ఓం” కారమునకు నేను వందనం చేస్తూ, విశ్వాన్ని ప్రకాశింపజేయుచున్న సూర్యతేజమైన సవితను నేను ఉపాసిస్తున్నాను.” అని గాయత్రికి ఉన్న వివిధ అర్థాలలో ఇది ఒకటి అర్థము. ఈ మంత్రమును చదువునఫ్ఫుడు ఐదు చోటులందు కాస్త ఆగి చదవాలి.
  1. ఓం, 
  2. భూర్-భువ:-సువ:, 
  3. తత్-సవితుర్-వరేణ్యం, 
  4. భర్గో-దేవస్య-ధీమహి, 
  5. ధియో- యోన:-ప్రచోదయాత్. 
నీవు ఈ మంత్రమును జపించునప్పుడు పై విధముగ ఐదు స్థలములందు కొంచెము ఆపి చదువవలెను.
ఎవరైతే ఈ మంత్రమును నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జపించెదరో వారు ఎన్నో విధములైన ప్రయోజనములు పొంది, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొంది జీవితంలోని అన్ని కష్టములను ఎదుర్కొను బలమును పొందుదురు.

  • AUM - Almighty God
  • BHOOR - Embodiment of vital or spiritual energy, BHUVAHA - Destroyer of suffering, SWAHA - Embodiment of Happiness, TAT - That (indicating God)
  • SAVITUR - Bright, Luminous, like sun, VARENYAM - Supreme, Best
  • BHARGO - Destroyer of Sins,DEVASYA - Divine, DHEEMAHI - May receive
  • DHEEYO - Intellect, YO - Who, NAH - Our, PRACHODAYAT - May inspire

ప్రపంచవ్యాప్తంగా గాయత్రి మంత్ర శక్తి ప్రభావంపై పరిశోధనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ మంత్రము యొక్క శాస్త్రీయ అంశం ఇప్పటికే కనుగొనబడి నిరూపింపబడినది.

  • గాయత్రీ మంత్రోఛ్ఛారణము వల్ల మెదడులోని విజ్ఞాన గ్రంధులు మేల్కోనబడతాయని పరిశోధన అద్భుతమైన సత్యాన్ని కనుగొంది.
  • గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది.
  •  అనంత మైన ఆత్మ శక్తి పెంపొందిచు మంత్రమె ఈ  గాయత్రీ మహా మంత్రం 

ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలో నింపుతుంది.


No comments:

Post a Comment

My Blog List